Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో బీజేపీ నేత సురేంద్ర మటియాలాను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. తన ఆఫీసులో రాత్రి 7.30 నిమిషాలకు టీవీ చూస్తున్న సమయంలో.. ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చారు. తొలుత సురేంద్రను కొట్టి.. ఆ తర్వాత అయిదు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిని ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అయితే ఈ దాడిలో మొత్తం ముగ్గురు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు ఆఫీసులోకి వెళ్లగా, మరో వ్యక్తి బైక్పై ఆఫీసు బయట ఉన్నట్లు తెలిపారు. హత్యకు పాల్పడిన తర్వాత ముగ్గురూ అక్కడ నుంచి బైక్పై పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. తన తండ్రికి శత్రువులు లేరని పోలీసులతో కుమారుడు తెలిపాడు. నిందితుల్ని అరెస్టు చేయాలని కోరాడు. ఓ ప్రాపర్టీ వివాదంలో బీజేపీ నేత సురేంద్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అయిదు బృందాలు నిందితుల కోసం అన్వేషిస్తున్నాయి.