Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 6 నుంచి 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. 6వ తరగతిలో 19,400 సీట్లు ఖాళీగా ఉండగా, 40,137 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 7 నుంచి 10 తరగతులకు కూడా భారీగానే దరఖాస్తులు వచ్చాయి. అయితే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 194 స్కూళ్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 6వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులకు ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 24న మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. మెరిట్ జాబితాలో ఉన్న విద్యార్థులకు మే 25 నుంచి 31 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లు సహా ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 040 -23120335, 23120336 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.