Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. సొంత గ్రౌండ్లో ఢిల్లీని 23 పరుగులతో ఢిల్లీని చిత్తు చేసింది. ఆర్సీబీ పేసర్లు చెలరేగడంతో ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏకంగా ముగ్గురు డకౌట్ కావడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. మనీష్ పాండే(50) ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో అమన్ ఖాన్(18) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.
ఆరంగేట్రం మ్యాచ్‌లోనే ఆర్సీబీ పేసర్ విజయ్‌కుమార్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో ఢిల్లీ ఐదో ఓటమిని మూటగట్టుకుంది. సొంత మైదానంలో డూప్లెసిస్ సేన రెచ్చిపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండో విజయం నమోదు చేసింది. విరాట్ కోహ్లీ అర్ధ శతకం బాదడంతో 174 రన్స్ చేసింది. ఆ తర్వాత బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీని 151 రన్స్‌కే పరిమితం చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మనీష్ పాండే(50) ఒక్కడే రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో విజయ్ కుమార్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. హర్షల్ పటేల్, పార్నెల్‌కు ఒక్కో వికెట్ దక్కింది.