Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తిరుమల కొండపై కొలువున్న శ్రీ వేంకటేశ్వరస్వామికి హైదరాబాద్ కు చెందిన భక్తులు భారీ విరాళం అందించారు. ఎస్సార్సీ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఏవీకే ప్రసాద్, ఏవీ ఆంజనేయ ప్రసాద్ కోటి రూపాయల డీడీని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. తాము అందించిన విరాళాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు కార్యకలాపాలకు వినియోగించాల్సిందిగా ఆ భక్తులు వైవీ సుబ్బారెడ్డిని కోరారు. దీనిపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేస్తున్నందుకు ఆ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.