Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా టీఎస్పీఎస్సీ పలు పరీక్షలు వాయిదా వేసిన విఫషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా ఆ పరీక్షలకు సంబందించిన కొత్త తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మే 16న అగ్రికల్చర్ ఆఫీసర్, మే 19న డ్రగ్స్ ఇన్స్పెక్టర్, జూన్ 28 అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్, జులై 18, 19న భూగర్భ జలశాఖలో గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్ష, జులై 20, 21న భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.