Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగర్‌కర్నూల్
యురేనియం పేరుతో బీజేపీ మళ్లీ నల్లమలలో చిచ్చుపెట్టాలని చూస్తుండడంతో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. యురేనియం వ్యతిరేక జేఏసీ నల్లమల పోరాట సమితి అధ్యక్షుడు నాసరయ్య ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లమల ప్రాంతాన్ని కేంద్రం యురేనియం పేరుతో బహుళజాతి కంపెనీలకు అమ్మేందుకు కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. కాగా మండలం బీకే ఉప్పునుంతల, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో సీపీఐ, ఎం, గిరిజన సంఘం నాయకులతో కలిసి పర్యావరణ రాష్ట్ర నేత నరసింహారావు పర్యటించారు. కొందరు బడాబాబుల కోసం దేశాన్ని, తెలంగాణను అమ్మేందుకు మోదీ కుయుక్తులు పన్నుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. నల్లమల అటవీ ప్రాంతం ఇప్పుడే పురుడు పోసుకుంటున్నదని, వణ్యప్రాణి సంపదను, ఇక్కడి ప్రజలను, ఆవాసాలను నాశనం చేసేందుకు ఎంపీ లక్ష్మణ్‌తో యురేనియం అంశాన్ని లేవనెత్తిచ్చారని విరుచుకుపడ్డారు. కార్యక్రమాల్లో యురేనియం వ్యతిరేక జేఏసీ, సీపీఎం నేతలు పాల్గొన్నారు.