Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం
డీఏవో పేపర్ లీక్ వ్యవహారంలో ఖమ్మం నగరంలో శనివారం సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఏవో ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో నిందితులైన లౌకిక్, సుష్మితల ఇంట్లో వారు తనిఖీలు నిర్వహించారు. గతంలోనే డీఏవో పేపర్ లీక్ అయినట్టు ధ్రువీకరించుకున్న అధికారులు ఖమ్మం నగరానికి చెందిన లౌకిక్, సుష్మిత దంపతులకు ప్రవీణ్ ఆ పేపర్ విక్రయించినట్టు తేలడంతో వారం రోజుల క్రితం వారిని అరెస్టు చేశారు. ఈ విచారణలో భాగంగా అసలు పేపరు లీకేజీ ఎలా జరిగింది ? ఎంత మందికి విక్రయించారు ? అది వారితోనే ఆగిందా ? లేక కొనుగోలు చేసిన వారు మరెవరికైనా పంపారా ? వంటి కోణాల్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం ఖమ్మం నగరానికి లౌకిక్, సుష్మిత దంపతులను తీసుకుని వచ్చిన అధికారులు వారి ఇంట్లోని ల్యాప్ట్యాప్ వంటి పరికరాలతోపాటు, నగదు లావాదేవీలకు సంబంధించి సోదాలు జరిపినట్టు తెలుస్తోంది.