Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సమ్మర్ ఆర్ట్ క్యాంపును నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.గంగాధర్ తెలిపారు. ఈ క్రమంలో మే 1 నుంచి 31 వరకు నిర్వహించే సమ్మర్ ఆర్ట్ క్యాంపు-2023లో 8 నుంచి 15 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు డ్రాయింగ్, పెయింటింగ్, పొటెరీ, కాలిగ్రఫీ, ఫోటోగ్రఫీ, యానిమేషన్ అంశాల్లో శిక్షణా తరగతులు ఉంటాయని తెలిపారు. అంతే కాకుండా ప్రతి శుక్రవారం, శనివారం మోటివేషన్, కమ్యూనికేషన్ స్కిల్ తరగతులు నిపుణులతో ఉంటాయని, ప్రతి రోజు యోగా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్యాంపు 31 రోజుల పాటు ఉంటుందని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని, మరిన్ని వివరాలకు సమ్మర్ ఆర్ట్ క్యాంపు కోఆర్టినేటర్ జె. వెంకటేశ్వర్లును ఫోన్ 9347048708, 8099224945, 040-23343616లో సంప్రదించాలని తెలిపారు.