Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీమ్ఇండియా క్రికెటర్లు మరే దేశంలోనూ క్రికెటల్ లీగుల్లో ఆడేదిలేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోసారి ఈ మేరకు కీలక ప్రకటన చేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఐపీఎల్ లీగ్ మాదిరిగానే తమ దేశంలోనూ భారీ లీగ్‌ను ఏర్పాటు చేయండని ఫ్రాంచైజీ యజమానులకు సౌదీ అరేబియా క్రికెట్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అలాంటి ఆఫర్‌పై బీసీసీఐ స్పందించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. తమ టాప్ ఆటగాళ్లు ఆడకపోయినా విదేశీ లీగుల్లో భాగస్వామ్యం కాకుండా ఫ్రాంచైజీలను మాత్రం అడ్డుకోబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత క్రికెట్‌కు ఆడుతున్న టాప్ ప్లేయర్ అయినా సరే విదేశీ లీగుల్లో పాల్గొనేందుకు అనుమతించం. ఐపీఎల్ ఫ్రాంచైజీలు అక్కడికి వెళ్తే మాత్రం ఆపేది లేదు. ఎందుకంటే ఇది వారి వ్యక్తిగత నిర్ణయం అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.