Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కలో ఓ వ్యక్తి వద్ద తుపాకితో శివప్రకాశ్ అనే వ్యక్తి తుపాకితో అక్కడికి రావడంతో పోలీసులు అడ్డుకుని ప్రశ్నించారు. దొడ్ల మధు యాదవ్ వద్ద గురుసాహెబ్ సింగ్ ప్రయివేటు గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
గతంలో ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేసిన అతనికి ఒక రైఫిల్, తుపాకి లైసెన్స్ ఉంది. గురుసాహెబ్ సింగ్ తన వద్ద ఉన్న తుపాకిని మధు యాదవ్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న శివ ప్రకాశ్‌కు ఇచ్చాడు. రైఫిల్ పట్టుకుని సభ జరిగే ప్రదేశానికి వచ్చిన శివప్రకాశ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో విషయం వెలుగు చూసింది. ఈ క్రమంలో ప్రయివేటు సెక్యూరిటీ గార్డును నియమించుకునేందుకు మధు యాదవ్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని, గురుసాహెబ్ తన రైఫిల్‌ను ఇతరులకు ఇవ్వడం నేరమని తెలిపిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.