Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
లక్నో పై టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ తీనుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ 159 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(74) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడికి కృనాల్ పాండ్యా(18), స్టోయినిస్(15) సహకారం అందించారు. లక్నోకు ఓపెనర్లు రాహుల్(74) కైల్ మేయర్స్ (29) శుభారంభం ఇచ్చారు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో మేయర్స్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 53 రన్స్ వద్ద ఆ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా(0)ను సికిందర్ రజా ఎల్బీగా ఔట్ చేశాడు. కృనాల్ పాండ్యాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నిర్మించాడు. పూరన్ డకౌటయ్యాడు. స్టోయినిస్ ఉన్నంత సేపు చెలరేగి ఆడాడు. 11 బంతుల్లో రెండు సిక్స్‌లతో 15 రన్స్ చేశాడు. దాంతో, లక్నో స్కోర్ 180 దాటేలా కనిపించింది. కానీ, సామ్ కరన్ మూడు వికెట్లతో లక్నోను దెబ్బకొట్టాడు. రబాడ రెండు వికెట్లు తీశారు. హర్‌ప్రీత్ బ్రార్, సికిందర్ రజా, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు.