Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చివరి 5 బంతులకు 5 సిక్సర్లు బాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను గెలిపించిన రింకు సింగ్‌పై స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. రింకు లాగా ఆడటం తన వల్ల కాదని, కనీసం అలా ఊహించలేనని విరాట్ పేర్కొన్నాడు. ‘‘ఐపీఎల్లో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. కొందరి ఆట చూస్తే.. అలా ఆడటం నేను ఊహించలేను కూడా. ఈ మధ్యే రింకు సింగ్ ఓ మ్యాచ్‌లో 5 బంతులకు 5 సిక్సర్లు బాదాడు. అదొక అద్భుతం. అలాంటిది ఎప్పుడూ జరగలేదు. వరుసగా అయిదు సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిపించడం అంటే అది ఏ స్థాయి ఆట? క్రికెట్లో ఈ పరిణామ క్రమం గొప్పది. కుర్రాళ్లు ఇలా వెలుగులోకి రావడం శుభ పరిణామం’’ అని కోహ్లి అన్నాడు.