Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కడప
వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. విచారణలో భాగంగా ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున అధికారులు రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని విచారించిన అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు భారీగా అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మొన్న ఉదయకుమార్ రెడ్డి, నేడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక సీబీఐ అధికారులు వరుస అరెస్టుల పర్వం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు 4సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ బృందం వెళ్లింది.