Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భోపాల్: ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాజీ సహచరుడు సునీల్ కనుగొలును కాంగ్రెస్ రంగంలోకి దించింది. ఆయన ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. సునీల్ గతంలో ఈయన ప్రధాని మోదీతో కలిసి బీజేపీ ప్రచార వ్యూహాన్ని రచించారు. 2017లో యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ గెలుపునకు బాటలు వేశారు. అనంతరం కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం వెనుక సునీల్ కృషి ఉంది. సునీల్ కనుగొలు(39) తండ్రి కర్ణాటక, తల్లి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. ఈయన విద్యాభ్యాసం తమిళనాడులో సాగింది. ఎంబీఏ, ఎంఎస్ అమెరికాలో పూర్తి చేశారు.