Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ తరుణంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాను అవినీతిపరుడినని కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ డబ్బు సంపాదించాలనుకుంటే ఐటీ శాఖలో కమిషనర్‌గా పనిచేసినప్పుడు కోట్లు వెనకేసుకునేవాడినని కేజ్రీవాల్ తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి దాచిపెట్టేందుకు ఏమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. తన అరెస్ట్‌కు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు. దేశాన్ని ప్రేమిస్తా, అవసరమైతే దేశం కోసం జీవితాన్నైనా అర్పిస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.