Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఆఫ్రికా దేశంలో సూడాన్ మరోసారి అల్లర్లతో అట్టుడుకుతున్నది. ఆర్మీ, శక్తిమంతమైన పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పలు చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రాజధాని ఖార్టూమ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 50 మందికిపైగా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 183 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సూడాన్ సెంట్రల్ మెడికల్ కమిటీ తెలిపింది. బాధితులు సెంట్రల్ ఖార్టూమ్ దవాఖానలో చికిత్స పొందుతున్నారని, వారిలో సాధారణ పౌరులతోపాటు మిలిటరీ సిబ్బంది కూడా ఉన్నారని వెల్లడించింది.