Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్
ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్లో ప్రజలకు మరిన్ని ఇక్కట్లు ఎదురు కానున్నాయి. వచ్చే 15 రోజుల్లో ప్రభుత్వం పెట్రోల్ ధరను రూ.10నుంచి రూ.14వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో శనివారం ఓ మీడియా సంస్థ కథనం వెలువరించింది. అదుపుతప్పిన ద్రవ్యోల్బణానికి తోడు ప్రపంచ విపణిలో చమురు ధరల పెరుగుదల తరుణంలో పాక్ ప్రభుత్వం ఈ చర్య చేపట్టనున్నట్లు అందులో తెలిపింది. అయితే ప్రస్తుతం పాక్లో పెట్రోల్ ధర లీటరు రూ.272 ఉండగా, ఇది రూ.286.77కు చేరే అవకాశాలున్నాయి.