Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు
బెంగళూరులో దారుణం చేసుకుంది. ప్రియురాలి పుట్టిన రోజును ఘనంగా చేశాడు, ఆపై కేకు కోసిన కత్తితోనే ఆమె గొంతుకోశాడు. ఆపై నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కర్ణాటకకు చెందిన నవ్య, ప్రశాంత్ లు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు ఇరువైపులా పెద్దలు అభ్యంతరం తెలిపారు. అయినాసరే పెళ్లి చేసుకోవాలని ఆ జంట నిర్ణయించుకుంది. ఉద్యోగరీత్యా ఇద్దరూ బెంగళూరులో ఉంటున్నారు.
ఈ తరుణంలో శుక్రవారం నవ్య బర్త్ డేను ఇద్దరూ ఘనంగా జరుపుకున్నారు. నవ్య, ప్రశాంత్ ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇంతలో నవ్యకు ఓ కాల్ వచ్చింది. కాసేపు మాట్లాడి పెట్టేశాక వాట్సాప్ లో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఎవరితో చాట్ చేస్తున్నావంటూ ప్రశాంత్ అడిగినా చెప్పలేదు. ముఖం కడుక్కుని వస్తానని బాత్రూంకు వెళ్లిన నవ్య లోపల వాట్సాప్ చాట్ చేస్తూ ఉండిపోయింది. దీంతో మండిపడ్డ ప్రశాంత్ చాట్ వివరాలు చూపెట్టాలని నిలదీశాడు. చాటింగ్ తన వ్యక్తిగత అంశమని, చూపించబోనని తేల్చి చెప్పింది. ఇదే విషయంపై మాటామాటా పెరగడంతో కోపంతో ఊగిపోయిన ప్రశాంత్ కేక్ కోసిన కత్తితో నవ్యపై దాడి చేశాడు. మెడపై విచక్షణారహితంగా పొడవడంతో నవ్య అక్కడికక్కడే చనిపోయింది. దీంతో నేరుగా రాజగోపాల్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన ప్రియురాలిని చంపేశానంటూ కత్తిని పోలీసులకు అప్పగించాడు. ఈ క్రమంలో డెడ్ బాడీని సమీపఆస్పత్రికి తరలించి, ప్రశాంత్ ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.