Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచిలో లభ్యమైన మహిళా మృతదేహం మిస్టరీని పోలీసులు చేధించారు. మృతదేహం సైదమ్మ అనే మహిళదిగా తేల్చారు. 13వ తేదీన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి సర్దార్ నగర్ గేట్ సమీపంలో సంచిలో ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని సంచిలో మహిళా మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.
ఈ తరుణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తు చేస్తుండగా ఆధారాలు లభించాయి. సూర్యాపేటకు చెందిన సైదమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. సైదమ్మ బడంగ్పేట్ ఎంసీఆర్ కాలనీకి కొన్నాళ్ల క్రితం వలస వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్దబావి శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి సైదమ్మకు గతంలో కొంత డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఆ డబ్బులు తిరిగి అడగడంతో ఆమె బ్లాక్ మెయిల్‌కు పాల్పడిందని దీంతో శ్రీనివాస్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.