Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎద్దుల బండ్లు, సైకిల్ రిక్షాలు, తోపుడు బండ్లు, వ్యవసాయ పనుల్లో వినియోగించే యంత్రాలు, ట్రాక్టర్లు వంటి నెమ్మదిగా కదిలే వాహనాలతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ట్రాఫిక్ రద్దీకి కారణమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆయా వాహనాల రాకపోకలను సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిషేధం విధించారు. అంతే కాకుండా వీటితో పాటు అంతర్రాష్ట్ర వాహనాలు, నేషనల్ పర్మిట్ లారీలు, లోకల్ లారీలు, గూడ్స్ వంటి భారీ వాణిజ్య వాహనాలను, ప్రయివేట్ బస్సులపై పలు ఆంక్షలు విధించారు.
10 టన్నుల కంటే ఎక్కువ బరువు వస్తువులను సరఫరా చేసే వాణిజ్య వాహనాలకు నగరంలోని పలు ప్రాంతాలలో ఉదయం, రాత్రి సమయాల్లో రాకపోకలను నిషేధించారు. నిర్మాణ సామగ్రిని మోసుకెళ్లే వాహనాలు, లోకల్ లారీలకు రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య అనుమతి ఉంటుంది. 3.5 టన్నుల నుంచి 12 టన్నుల లోపు బరువు వస్తువులను సరఫరా చేసే వాహనాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే అనుమతిస్తారు. జంట నగరాలలో ప్రైవేట్ బస్సులకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య నడపడానికి అనుమతి లేదు అని తెలిపారు. తప్పని సరిగా వీటిని పాటించాలని సూచించారు.