Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆదివారం ఆమె హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజి దగ్గర జాతీయ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పేలి బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ తరుణంలో ఆమెను కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిలో డ్రైవర్ బాబ్జి (25)కి గాయాలయ్యాయి. నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019లో వైసీపీలో చేరారు. అందులో ఇమడలేక బీజీపీలో చేరారు.