Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మేడ్చల్
నగరంలోని నకిలీ విద్యుత్ వైర్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కిష్టాపూర్లోని సాగర్ ఎలక్ట్రికల్స్ దుకాణంపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఫినోలెక్స్, పాలికాబ్, డాక్టర్ ఫిక్స్ ఇట్ బ్రాండెడ్ పేర్లతో విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ తరుణంలో రూ.17 లక్షలు విలువచేసే ఎలక్ట్రికల్ కేబుళ్లు, ఇతర సామాగ్రిని సీజ్ చేశారు. అఫ్జల్గంజ్ వాసి రమేష్తో కలిసి దుర్గేష్ ఎలక్ట్రికల్ వైర్ల వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన గౌతమ్ నుంచి దుర్గేష్, రమేష్ నకిలీ వైర్లు తెస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీకి చెందిన నిందితుడు గౌతమ్ పరారీలో వున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.