Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలోని మియాపూర్లో ఓ రియల్ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ పేరుతో జానీ బాషా షేక్ ఆ సంస్థను ఏర్పాటు చేశారు. ఎండీ వ్యవహరిస్తున్న ఆయన రాయల్ ప్యారడైజ్ పేరుతో వెంచర్ వేసి రూ.50కోట్లు ఎగ్గొట్టారు. ఈ తరుణంలో బాధితులు మియాపూర్లోని మైత్రి ప్రాజెక్ట్స్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. సంస్థ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసి 20 రోజులు పూర్తయినా ఇప్పటి వరకు వారు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.