Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని ముజప్ఫర్‌నగర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 3 ఏళ్ల బాలికను లైంగికదాడి చేశాడన్న ఆరోపణలపై 10 ఏళ్ల బాలుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శనివారం తమ కూతురిని ఆ బాలుడు స్కూల్ భవంతిపైకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాలుడు ఒకటవ తరగతి చదువుతుండగా బాలిక కిండర్‌గార్టెన్‌లో ఉంది.