Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్గొండ
నల్గొండ జిల్లా చండూరు మండలం తాస్కానిగూడెంలో శనివారం సాయంత్రం మృతదేహంతో ప్రారంభించిన ఆందోళన ఆదివారం రాత్రి వరకు 24 గంటలు దాటినా కొనసాగుతూనే ఉంది. యువతిని వేధించిన ఫిర్యాదుపై అదే గ్రామానికి చెందిన అబ్బనబోయిన శివ(26)ను పోలీసులు ఇటీవల విచారించారు. ఈ క్రమంలో అతడు పురుగుమందు తాగగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. శనివారం సాయంత్రం గ్రామానికి చేరిన శివ మృతదేహాన్ని యువతి ఇంటి ఆవరణలో ఉంచి మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసన కొనసాగిస్తున్నారు. అప్పటివరకు మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు. మృతదేహం నుంచి దుర్వాసన మొదలైంది. దూరంగా కూర్చుని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. యువతి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని ఎటో వెళ్లిపోయారు. గ్రామంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.