Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. నిన్న పులివెందుల ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేటి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. కాగా.. పులివెందుల్లో తన నివాసం నుంచి నేటి తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు బయలు దేరారు. 10 వాహనాల్లో అనుచరులతో కలసి హైదరాబాద్‌కు బయలు దేరారు. ఇప్పటికే అవినాష్‌ను జనవరి 28 , ఫిబ్రవరి 24, మార్చ్ 10, మార్చ్ 14 న సీబీఐ విచారణ చేసింది. అవినాష్ విచారణ సమయంలో గతంలో మాదిరిగానే అధికారులు వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేయనున్నారు.