Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సంగారెడ్డి
మంజీర కుంభమేళాకు వేళయ్యింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నపూర్ గ్రామాల శివారులోని గరుడ గంగ పూర్ణ మంజీర నది కుంభమేళా ఈ నెల 24 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్నది. స్థానిక సిద్ధ సర్వస్వతీదేవి పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో కుంభమేళాను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నది. మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లో పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక గుండా గౌడ్గావ్ వద్ద తెలంగాణలో మంజీర నది ప్రవేశిస్తున్నది. ఈ నదికి మొదటి సారి పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో 2010లో కుంభమేళా నిర్వహించారు. ఆ తర్వాత 2013, 2018లో కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో కుంభమేళా నిర్వహించారు.