Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహారాష్ట్ర
మహారాష్ట్రలోని నవీ ముంబైలో నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ఎండ వేడిమి భరించలేక మరణించిన వారి సంఖ్య 11కు చేరింది. ఆదివారం నవీ ముంబైలో అమిత్ షా ముఖ్య అతిథిగా మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డు ప్రదానోత్సవం జరిగింది. బీజేపీ-శివసేన (ఏక్నాథ్ వర్గం) ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభను నిర్వహించారు. సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్‌కు మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డును ప్రదానం చేశారు. అయితే, మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఈ కార్యక్రమం నిర్వహించడంతో అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన సామాజిక కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన ఈ సభకు వచ్చిన వారికోసం పెద్ద పెద్ద ఎల్ఈడీ స్రీన్లు, సౌండ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. నీడనిచ్చే వసతి మాత్రం కల్పించలేదు.