Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చండీగఢ్
పంజాబ్ లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పంజాబ్ పోలీసులు సోమవారం ఓ జవానును అరెస్టు చేసినట్టు బఠిండా సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు.
ఈ కేసులో తొలుత తమను తప్పుదోవ పట్టించిన సైనికుడే అసలు నిందితుడని, అతడే కాల్పులకు పాల్పడినట్లు ఖురానా తెలిపారు. ఈ మేరకు సైనిక స్థావరంలో గన్నర్గా విధులు నిర్వహిస్తున్న మోహన్ దేశాయ్ అనే సైనికుడిని ఈ కేసులో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు ఈ కాల్పులకు పాల్పడ్డాడు. మృతి చెందిన జవాన్లతో ఇతడికి యక్తిగత వైరం ఉంది అని ఎస్ఎస్పీ పేర్కొన్నారు.