Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యూపీలో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఆ కాల్పుల్లో అతనికి 9 బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ అతిక్ శరీరంపై 9 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టమ్ పరీక్షలో తేలినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అతిక్ సోదరుడు అష్రఫ్ అహ్మద్ శరీరం నుంచి అయిదు బుల్లెట్లును తీసినట్లు తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని ఓ హాస్పిటల్ వద్ద ఆ ఇద్దర్నీ కాల్చి చంపారు అతిక్ తలలోకి ఒక బుల్లెట్ దిగింది. మిగిలిన 8 బుల్లెట్లు అతని ఛాతి, వెన్నులోకి దిగాయి. మెడికల్ చెకప్ కోసం ఇద్దర్ని తీసుకువెళ్తున్న సమయంలో.. ఈ కాల్పుల్లో అతిక్ అక్కడిక్కడే మృతిచెందాడు. అయిదుగురు సభ్యుల డాక్టర్ల బృందం పోస్టు మార్టమ్ నిర్వహించింది.