Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమెరికా: ఈ కాలంలో పిల్లికి కూడా బిచ్చం పెట్టని వారున్నారు. ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాలని అనుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారి కోవలోకే చెందిన అమెరికాలోని ఓ యువకుడు హైవేపైన డాలర్ల వర్షం కురిపించాడు. కారులో నుంచి వంద డాలర్ల నోట్లను బయటకు విసిరేశాడు. దీంతో వెనక కార్లలో వస్తున్న జనం తమ వాహనాలను రోడ్డు పక్కన ఆపి, నోట్లు ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఈ ఘటన అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కానీ ఇది పిచ్చి చేష్ట అని, తమ ఖాతాలో సొమ్మంతా ఖాళీ చేస్తున్నాడని.. తమను రోడ్డున పడేసే పరిస్థితికి తెస్తున్నాడని సదరు యువకుడి కుటుంబం వాపోతోంది. ఒరెగాన్ కు చెందిన కొలిన్ డేవిస్ మెక్ కార్తీ ఈ నెల 11న హైవే పైన కారులో ప్రయాణిస్తూ రెండు లక్షల విలువైన (సుమారు రూ.1.6 కోట్లు) వంద డాలర్ల నోట్లను బయటకు వెదజల్లాడు.