తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM
— JanaSena Party (@JanaSenaParty) April 16, 2023
Authorization
తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM
— JanaSena Party (@JanaSenaParty) April 16, 2023
నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వైసీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మండిపడ్డారు. ఎదైన ఉంటే ప్రభుత్వాలపై చేయాలి గానీ తెలంగాణ ప్రజలపై చేయడం సరికాదన్నారు.
రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్‌పై వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు విమర్శలు చేయడంతో హద్దులు దాటి మాట్లాడటం ఇబ్బందికరంగా మారింది. గతంలో కూడా నాయకులకు నేను ఒకటి చెప్పాను. పాలకులు వేరు. ప్రజలు వేరు. పాలకులు చేసిన వ్యాఖ్యలతో ప్రజలకు సంబంధం లేదు. మంత్రి హరీశ్ రావు ఏ సందర్భంగా వ్యాఖ్యలు చేశారో తెలియదు. దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు, మంత్రులు తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా మనస్తాపం కలిగించింది. దయచేసి మంత్రివర్గంలో ఎవరైనా అదుపుతప్పి మాట్లాడితే తోటి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలను ఖండించాలి. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.