Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నటుడు మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ తాజాగా ‘మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్షిప్స్’లో పాల్గొని పతకాలు సాధించాడు. ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్(50మీ, 100మీ, 200మీ, 400మీ, 1500మీ) లో ఏకంగా 5 స్వర్ణాలు సాధించాడు. దీంతో తండ్రీ మాధవన్ సంతోషంలో మునిగిపోయారు. ‘‘దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో వేదాంత్ గెలుపొందాడు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని భారత్‌కు 5 స్వర్ణాలు అందించాడు. వేదాంత్‌ను చూస్తుంటే చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. అతడికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అని ఇన్‌స్టా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.