Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనంతపురం: బుక్కరాయ సముద్రంలో కారు ప్రమాదానికి గురైంది. అనంతపురానికి చెందిన విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్‌గా ఉమాపతి విధులు నిర్వహిస్తున్నాడు. దేవరకొండ మీద దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆయన కారు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఉమాపతి అక్కడికక్కడే మరణించారు. బయట నుంచి వారిస్తున్నా కారును ఉమాపతి లోయ వైపు నడిపినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆర్థిక ఇబ్బందులతో ఉమాపతి ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.