Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి అవినాశ్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని సీబీఐ తెలియజేసింది. వాస్తవానికి ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. ఈ తరుణంలో, తెలంగాణ హైకోర్టులో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణకు ఈరోజు మినహాయింపును ఇవ్వాలని సీబీఐను అవినాశ్ తరపు లాయర్లు కోరారు. వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన సీబీఐ రేపు ఉదయం విచారణకు రావాలని తెలపింది.