Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గన్మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఇద్దరు గన్మెన్లు వెనక్కి రావాలని వైఎస్ఆర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. గత నెల 29తో బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. ఈ తరుణంలో ఆయన సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో తన గన్మెన్లను తొలగించినట్లు బీటెక్ రవి కూడా ధ్రువీకరించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, అవసరమైనే న్యాయపరంగా పోరాడుతానని ఆయన తెలిపారు. ప్రస్తుతం బీటెక్ రవి సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎంపీ వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ బీటెక్ రవి గన్మన్లను తొలగించడం చర్చకు తావిస్తోంది.