Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు మల్కాజ్ గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లో తీన్మార్ మల్లన్నకు సాధారణ బెయిల్ లభించింది. మరో నలుగురికి కూడా మల్కాజ్ గిరి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల చొప్పున వ్యక్తిగత ష్యూరిటీ చెల్లించాలని కోర్టు తీన్మార్ మల్లన్న తదితరులను ఆదేశించింది. బెయిల్ లభించిన నేపథ్యంలో, తీన్మార్ మల్లన్న రేపు చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. పలు ఆరోపణలతో తీన్మార్ మల్లన్నపై తెలంగాణ వ్యాప్తంగా 90 వరకు కేసులు నమోదవడం తెలిసిందే. ఇటీవల క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు సోదాలు జరిపారు. అనంతరం తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు.