Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నిర్మల్
జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని కలెక్టర్ కే.వరుణ్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం రోడ్డు భద్రత కమిటీ 2023 జిల్లాస్థాయిమార్చ్పై సమీక్షా సమా వేశం నిర్వహించారు. జనాభా పెరిగినందున గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని, ఇవి చిన్నచిన్న అజాగ్రత్తల వల్ల చోటు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... జిల్లాగా ఏర్పడిన తరువాత రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి ప్రమాదాలు జరుగకుండా చూడాలన్నారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమీక్ష నిర్వహిం చారు. అదనపు కలెక్టర్ రాంబాబు, అడిషనల్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్సైలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.