Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్సీవీ) సూపర్ క్యారీలో కొత్త వెర్షన్‌ను మారుతి సుజుకీ మార్కెట్లో విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.5.15 లక్షల నుంచి రూ.6.30 లక్షల మధ్యన ఉంది. వీటిలో పెట్రోల్‌తో నడిచే 1.2 లీటర్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంజన్ మోడల్ రూ.5.15 లక్షల నుంచి రూ.5.30 లక్షల మధ్యన ఉండగా సీఎన్జీ వాహనాల ధర రూ.6.15 లక్షల నుంచి రూ.6.30 లక్షల మధ్యన ఉంది. మినీ ట్రక్ కస్టమర్ల ప్రత్యేక అవసరాలు దృష్టిలో ఉంచుకుని 2016లో మారుతి దీన్ని విడుదల చేసింది. ఇప్పటివరకు 1.5 లక్షల సూపర్ క్యారీ వాహనాలు విక్రయించింది.