Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోరుట్ల: ఓ మహిళ 24 వేళ్లతో ఉన్న మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన జగిత్యా ల జిల్లా కోరుట్లలోని ప్రభుత్వ ఏరి యా దవాఖానలో చోటుచేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన దండవేణి రవళి మొదటి కాన్పు కోసం కోరుట్ల దవాఖానలో చేరింది. ఆదివారం సాయంత్రం సాధారణ కాన్పు ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు చేతులు, కాళ్లకు ఆరు చొప్పున మొత్తం 24 వేళ్లు ఉన్నాయి. రవళి, సాగర్ దంపతులది మేనరికమని, పుట్టిన శిశువుకు 24 వేళ్లు ఉండటం అరుదైన విషయమని దవాఖాన సూపరింటెండెంట్ సునీత రాణి తెలిపారు.