Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన - హైదరాబాద్: ఎంసెట్‌కు కొత్తగా దరఖా స్తు చేస్తున్నారా? అయితే మీరు ఏ పట్టణంలో పరీక్షరాస్తారో దానిని ఎంచుకొనే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు దరఖా స్తు చేసేవారంతా జీహెచ్ఎంసీలోని పరీక్షాకేంద్రాల్లోనే ఎంసెట్ రాయాల్సి ఉన్న ది. సొంత జిల్లాలో రాస్తామంటే అవకా శం లేదు. సోమవారం నాటికి టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ)కు మొత్తం 3,18,169 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ నుం చి 2,46,413 రాగా, ఏపీ నుంచి 71,756 వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇంత భారీగా దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి. దీం తో సెంటర్లు కేటాయించలేని పరిస్థితి నెలకొన్నది. ఏపీలో సైతం ఇదే పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా ఎంసెట్ సెంటర్ల జాబితా నుంచి 15 పట్టణాలను బ్లాక్ చేశారు.
బ్లాక్ చేసిన పట్టణాలివే....
నల్లగొండ, కోదాడ, ఖమ్మం, భద్రా ద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నర్సంపేట, కర్నూల్, విజయవాడ, గుంటూరు.