Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ
సీఐడీ తీరును నిరసిస్తూ లాయర్లు ఆందోళనబాట పట్టారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర రాజేంద్రప్రసాద్, సీనియర్ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌లకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిని నిరసిస్తూ సోమవారం బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరిం చి నిరసన తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్, సుంకర రాజేంద్రప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేబీ సుందర్ మాట్లాడుతూ... సీఐ డీ పోలీసులు రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.