Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే దూసుకెళ్తోంది. ఆదాయం జోరుగా పెంచుకుంటోంది. 2022-23 సంవత్సరంలో రూ.18,973.14 కోట్ల ఆదాయం ఆర్జించింది. సోమవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ 2022-23 సంవత్సర వార్షిక నివేదికను వెల్లడించారు. 2021-22 సంవత్సరంలో వచ్చిన రూ.14,266 కోట్ల ఆదాయంతో పోల్చితే ఈసారి అదనంగా రూ.4,707.14 కోట్లు వచ్చిందని చెప్పారు. 2022-23లో 131.854 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేయగా రూ.13,051.10 కోట్ల ఆదాయం వచ్చిందని జీఎం చెప్పారు. 2022-23లో 255.59 మిలియన్ల మంది ప్రయాణికులను చేరవేయడంతో రూ.5,140.70 కోట్ల ఆదాయం వచ్చిందని, తెలిపారు. ఈ ఏడాదిలో 50 కి.మీల కొత్త లైన్లు, 151.48 కి.మీ డబుల్ లైన్లు, 182.91 కి.మీ ట్రిపుల్ లైన్ల నిర్మాణం చేపట్టిన ట్టు చెప్పారు. స్ర్కాప్ అమ్మకాల ద్వారా రూ.391 కోట్లు వచ్చిందన్నారు. ఇక 2021-22లో టికెట్ల తనిఖీ ద్వారా రూ.111.52 కోట్ల ఆదాయం రాగా 2022-23లో రూ.211.26 కోట్లు (99.74 కోట్లు అదనంగా) వచ్చింది. ఇదిలా ఉండగా.. దేశంలోని వివిధ రైల్వేల కంటే అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు దక్షిణ మధ్య రైల్వేకు 2022లో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు, ట్రాన్స్‌పోర్టు కేటగిరీలో కాచిగూడ, గుంతకల్లు స్టేషన్లకు రెండు బహుమతులు వచ్చాయి.