Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భవిష్యత్తరాలను దృష్టిలో పెట్టుకొని కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దూలపల్లి చౌరస్తా నుంచి బహదూర్‌పల్లి చౌరస్తా వరకు రూ.25 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న 100 ఫీట్లరోడ్డు విస్తరణ పనులను, కొంపల్లి అపర్ణ ఫామ్గ్రూప్స్ సెఫ్టిక్ ట్యాంక్ నుంచి దూలపల్లి కల్వర్టు అశోక్ అలా మైసన్ వరకు రూ.2.88 కోట్లతో చేపట్టనున్న ఎస్ఎన్డీపీ నాలా విస్తరణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన రూ.25 కోట్ల నిధులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేయించారని ఈ సందర్భంగా వారు తెలిపారు. త్వరలోనే రూ.4 కోట్ల వ్యయంతో దూలపల్లి కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అపర్ణఫామ్గ్రూప్స్లో సుమారు 10 కాలనీలకు డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, కమిషనర్ శ్రీహరి, దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ గరిశె నరేందర్‌రాజు, కౌన్సిలర్లు చింతల రవీందర్‌యాదవ్, పార్టీ యువజన విభాగం నియోజకవర్గం అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్యాదవ్, నాయకులు చింతల దేవేందర్‌యాదవ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.