Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సుడాన్: సుడాన్ దేశంలో జరిగిన ఘర్షణల్లో 200 మంది మరణించారు. సుడాన్ దేశంలో సైన్యం, పారామిలిటరీల మధ్య జరిగిన పోరులో 200 మంది మరణించగా, మరో 1,800 మంది గాయపడ్డారు. క్షతగాత్రులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి.2021వ సంవత్సరంలో సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్బుల్ ఫట్టా అల్ బుర్హాన్కు, పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న అతని డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య సాగుతున్న పోరాటం హింసాత్మకంగా మారింది. దౌత్యవేత్తలు కాల్పుల విరమణ కోసం పిలుపు ఇచ్చినప్పటికీ పోరాటం సాగుతూనే ఉంది. సుడాన్లోని యూరోపియన్ యూనియన్ రాయబారి ఇంటిపై సోమవారం దాడి జరిగినట్లు బ్లాక్ అగ్ర దౌత్యవేత్త జోసెప్ బోరెల్ తెలిపారు.సుడాన్ దేశం వైమానిక దాడులు, ఫిరంగి దళాల కాల్పులతో దద్దరిల్లింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు రొట్టెలు, పెట్రోల్ కోసం జనం బారులు తీరారు.ఈ కాల్పుల్లో 200 మంది వరకు మరణించారని, మరో 1800 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మిషన్ హెడ్ వోల్కర్ పెర్థెస్ చెప్పారు. సుడాన్ దేశంలో కాల్పులు దేశానికి వినాశకరమని, తక్షణమే కాల్పులు నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు.ఈ దాడుల్లో ఖార్టూమ్ తో సహా పలు నగరాల్లోని ఆసుపత్రులు దెబ్బతిన్నాయి.