Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ సాయంత్రం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ను చూసేందుకు నగరవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడాలని అనుకునేవాళ్లకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు.
మ్యాచ్ చూసేందుకు వెళ్లే క్రికెట్ అభిమానులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వీసీ సజ్జనార్ వెల్లడించారు. మ్యాచ్కు ముందు, తర్వాత ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా, సురక్షితంగా ఉప్పల్ స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందుల్లో పడకండని సలహా ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేసిన సజ్జనార్.. ప్రత్యేక బస్సుల జాబితాను పోస్టు చేశారు.