Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఉత్తరప్రదేశ్: కోల్‌కతా నైట్ రైడర్స్ యువ సంచలనం రింకూ సింగ్ ఇటీవల ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టి తన జట్టుకు మరపురాని విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రింకూ పేరు మారుమోగిపోతోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు.
కోల్‌కతా టీమ్‌కు ఎంపిక కావడంతో ప్రస్తుతం ఆర్థికంగా స్థిరపడ్డాడు. అయితే మిగత స్టార్ క్రికెటర్లతో పోల్చుకుంటే రింకూ సంపాదన చాలా అంటే చాలా తక్కువ. అయినా తనకు ఉన్న దాంతోనే ఇతరులకు సహాయపడాలని రింకూ నిర్ణయించుకున్నాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న యువ క్రికెటర్ల కోసం అలీగఢ్‌లో హాస్టల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఏకంగా రూ.50 లక్షలు ఖర్చుపెడుతున్నాడు. రింకూ చిన్ననాటి కోచ్ జాఫర్ అలీగఢ్‌లో క్రికెట్ స్కూల్, అకాడమీ నడిపిస్తున్నారు. అక్కడే రింకూ తన కొత్త హాస్టల్ నిర్మించనున్నాడు.