Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బెంగళూరులో నీటి పైపులైన్ కోసం తవ్విన గొయ్యిలో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మాగడిలోని గొల్లరహట్టి సమీపంలో జరిగింది. బెంగుళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు నీటి పైప్‌లైన్‌ను కోసం పెద్ద గొయ్యిని తవ్వారు. కానీ సంఘటనా స్థలంలో ఎటువంటి హెచ్చరిక బోర్డును ఉంచకపోవడం ప్రమాదానికి దారి తీసింది. భద్రతా చర్యలను విస్మరించిన ఫలితంగా ప్రాణాంతకం సంభవించింది.
పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ BWSSB ఇంజనీర్, కాంట్రాక్టర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలాంటి బోర్ వెల్ సంఘటనలు జరుగుతూనే ఉన్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగానే ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటనలు తరచుగా వెలుగులోకి రావడంపై మండిపడుతున్నారు.