Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ - హైదరాబాద్
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, కమెడియన్ అల్లు రమేశ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆనంద్ రవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ తరుణంలో సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అల్లు రమేశ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా కనిపించారు. ఇటీవలే విడుదలైన నెపోలియన్ సినిమాలో ఆయన నటించారు. విశాఖపట్టణానికి చెందిన అల్లు రమేష్ నాటకాల్లో నటించేవారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. యూట్యూబ్‌లో ప్రసారమయ్యే మా విడాకులు వెబ్ సిరీస్‌లో కూడా నటించారు.