Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -జగిత్యాల: డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపై కుట్లువేసి చికిత్స చేసి ఇంటికి పంపించారు. రోజూ కడుపు నొప్పి బాధిస్తున్నా డెలివరీ తర్వాత సాధారణమేనని భావించింది. అయితే, ఏడాది గడిచినా నొప్పి తగ్గకపోవడంతో ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. సిజేరియన్ ఆపరేషన్ చేసిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. ఆమె కడుపులో ఓ క్లాత్ మరిచిపోయి కుట్లు వేశారని స్కానింగ్ లో తేలింది. వైద్యుల నిర్లక్ష్యంతో క్లాత్ ను ఆమె కడుపులోనే మరిచిపోయారు.
ఈ క్రమంలో నవ్యకు ఇబ్బందులు మొదలయ్యాయి. తిన్న అన్నం జీర్ణం కాలేక కడుపునొప్పితో రోజూ అవస్థ పడింది. ఆమె పరిస్థితిని చూసి కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. ఇటీవల ఓ ప్రయివేటు ఆస్పత్రిలో అమెను చూపించారు. కడుపునొప్పికి కారణం ఏంటో అని గుర్తించేందుకు వైద్యులు స్కానింగ్ చేయగా కడుపులో క్లాత్ ఉన్నట్లు తేలింది. ఈ తరుణంలో మరోసారి నవ్యకు ఆపరేషన్ చేసి క్లాత్ ను బయటకు తీశారు. అయితే, ఈ క్లాత్ సాధారణంగా ఆపరేషన్ థియేటర్లలో ఉండే క్లాత్ కాదని, అది ఆపరేషన్ థియేటర్లోకి ఎలా వచ్చిందని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.